(ఆంధ్రప్రభ, విజయవాడ) : వ్యాపార విస్తరణలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఎంతో కీలకంగా ఉందని నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు అభిప్రాయపడ్డారు. నగరంలోని ఓ హోటల్ లో ఆంధ్ర చాంబర్ కామర్స్ విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యాపార వాణిజ్య విస్తరణ ఎలా చేయొచ్చు, ఎలా చేయాలి, ఎలా చేసుకోవచ్చు అనే అంశంపై ఉచిత సెమినార్ ను నిర్వహించారు.
ఈ సెమినార్ కు ముఖ్యఅతిథిగా ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడ చైర్మన్ రాజయ్య, నెల్లూరు జిల్లా చాప్టర్ చైర్మన్ రంగయ్య నాయుడు, ఎఫ్ఎన్ఎఫ్ కన్వీనర్ విజయలక్ష్మి, స్పీకర్ ఎండి ఇలియాస్, ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడ అసిస్టెంట్ సెక్రెటరీ రామారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ… రానున్న రోజుల్లో వ్యాపార వాణిజ్య విస్తరణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. వ్యాపార రంగంలో ఈ డిజిటల్ టెక్నాలజీ చాలా అత్యవసరంగా భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. అలాగే పలువురు వ్యాపారవేత్తలు వారి అభిప్రాయాలను, అనుభవాలను, వ్యాపార రంగంలో అభివృద్ధి జరిగే విధానాన్ని ప్రోత్సహించే రీతిలో ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ సెమినార్ లో ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, డిజిటల్ మారిటింగ్ ఉత్సాహ వంతులు 50మంది పాల్గొన్నారు.