Monday, November 25, 2024

AP: మితిమీరిన రాజకీయ జోక్యంతోనే ఏసీఏ అపహాస్యం.. కేశినేని చిన్ని

ఆంధ్ర‌ప్రభ స్మార్ట్‌, ఎన్టీఆర్ బ్యూరో : గత ప్రభుత్వ హయాంలో మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగానే ఏసీఏ అభాసుపాలు అయిందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్‌ పేర్కొన్నారు. అన్ని దొంగ రిజిస్ట్రేషన్ లతోనే ఫెడరేషన్ ఏర్పాటు చేశారని, ఇప్పటికే ఏసీఏలో 340కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు చెప్పిన ఆయన త్వరలోనే ఏసీఏలో పూర్తిస్థాయి ప్రక్షాళన జరుగుతుందన్నారు.

తాడేపల్లిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… గత ప్ర‌భుత్వం నిర్వాహ‌కం వ‌ల్ల ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ వివాదాల్లో చిక్కుకుందన్నారు. వైసీపీ నేతల కబ్జాలోనే ఇంకా ఉండడం దారుణం అన్నారు. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ 34 ఫెడ‌రేష‌న్స్ ఉంటే అన్ని దొంగ రిజిస్ట్రేషన్ లు చేశారని ఆరోపించారు. ఈ ఫెడరేష‌న్స్ క్రీడాకారుల ద‌గ్గ‌ర కాకుండా వైసీపీ నాయ‌కుల చెంత వున్నాయని. వాటిని త్వ‌ర‌లో క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌బోతున్నట్లు చెప్పారు. దొంగ రిజిస్ట్రేషన్ చేసిన వారిపై క్రిమిన‌ల్ కేసులు తప్పకుండా పెడతామన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ 340కేసులతో చీడ పట్టుకుపోయి ఉందని చెప్పారు.

- Advertisement -

వైసీపీ నేతల భూ దోపిడీ…

గ‌త ప్రభుత్వం నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌ భూక‌జ్జాలు, భూ ఆక్ర‌మ‌ణ‌లు, రెవెన్యూ రికార్డ్స్ లో స‌రిగ్గా న‌మోదు కాక‌పోవ‌టంపై ఫిర్యాదులు అందుతున్నాయని కేశినేని చిన్ని తెలిపారు. జోగి ర‌మేష్, ఇత‌ర వైసీపీ ఎమ్మెల్యేల‌ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో దేవ‌దాయ భూములే కాకుండా అగ్రిగోల్డ్ భూములు కూడా క‌బ్జాకు గుర‌య్యాయ‌న్నారు. జ‌గ‌న్ పాల‌న‌లో ఒక్కో జిల్లాలో ఒక్కో మంత్రి భూదోపిడీ చేశారని ఘాటుగా ఆరోపించారు. గ్రీవెన్స్ లో వ‌చ్చే ఫిర్యాదులను కృష్ణాజిల్లాలోని ఎమ్మెల్యేల‌తో క‌లిసి పరిష్క‌రించేందుకు కృషి చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement