మైలవరం – 108 అంబులెన్స్ సిబ్బంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని సకాలంలో ఆసుపత్ర్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడటమే కాదు పురిటి నొప్పులతో ఉన్న గర్భవతికి కాన్పు కూడా చేసి పసిగుడ్డుకు లోకాన్ని కూడా చూపించడంతో మానవత్వాన్ని చాటి చెప్పారు.సిబ్బంది తెలిసిన వివరాల ప్రకారం మండలంలోని పోరాటనగర్ గ్రామానికి చెందిన పి.కీర్తి(23) గర్భవతి కాగా కాన్పు సమయం కావడంతో మైలవరం’లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసి 108 అంబులెన్స్’కు సమాచారం అందించారు.జి.కొండూరు వాహనం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మైలవరం వచ్చి నిండు గర్భిణీ “కీర్తి’ని అంబులెన్స్’లో ఎక్కించారు.విజయవాడ తరలించే క్రమంలో “గొల్లపూడి’సమీపంలో రాత్రి 2.15 సమయంలో పురిటి నొప్పులు అధికమవ్వడంతో 108 సిబ్బంది కె.గోపాలకృష్ణ, షేక్ శహబాషి’లు గర్భిణీతో పాటు ప్రయాణిస్తున్న అమ్మమ్మతో కలిసి తమకున్న పరిజ్ఞానంతో సుఖ ప్రసవానికి సహకరించారు.గర్భిణీ “కీర్తి’ఆడబిడ్డకు జన్మనిచ్చింది.తల్లిబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండగా వారిని విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.కాన్పుకు సహకరించిన 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement