విజయవాడ – టిడిపి విజయవాడ ఎంపి కేశినాని వ్యవహారశైలీని తప్పుపడుతూ ఏకంగా మీడియా సమావేశంలో దుమ్మెత్తి పోసిన విజయవాడ నగర నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగూల్ మీరాలు చంద్రబాబు జోక్యంతో మెత్తబడ్డారు.. నగర పాలక సంస్థ ఎన్నికలలో అందరితో కలసి ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు.. కాగా, కేశినేని వ్యవహర శైలి మారకుంటే రేపటి చంద్రబాబు పర్యటను బహిష్కరిస్తామని ఈ ముగ్గురు నేతలు చేసిన బహిరంగ ప్రకటన విశాఖలో ఉన్న టిడిపి అధినేతకు చేరింది.. దీంతో ఆయన నేరుగానే రంగం ప్రవేశం చేశారు.. . టెలికాన్ఫరెన్స్లో అందరితో మాట్లాడాడరు… అసంతృప్తి నేతలను సముదాయించారు.. చంద్రబాబు ఆదేశాలతో ఈ ముగ్గురు నేతలతో అచ్చెన్నాయుడు, టి.డి. జనార్దన్, వర్ల రామయ్య స్వయంగా చర్చించారు. ఈ నేపథ్యంలోనే టిడిపి మేయర్ అభ్యర్ధి కేశినేని శ్వేత నేరుగా అసంతృప్తి నేతల ఇళ్లకు వెళ్లారు. బొండ ఉమ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించారు. శ్వేతతో పాటు విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెట్టం రఘురామ్ కూడా ఉమ ఇంటికి వెళ్లారు. ఈ ఎన్నికల్లో సహకరించాలని ఆమె కోరారు. ఆ తర్వాత బుద్దా వెంకన్న, నాగుల్ మీరాల ఇళ్లకు వెళ్లి తనకు మద్దతును శ్వేత అభ్యర్ధించారు.. అధినేత జోక్యం, మేయర్ అభ్యర్ధి స్వయంగా తమ ఇళ్లకు వచ్చి చర్చలు జరపడంతో బొండా, బుద్దా, నాగూల్ మీరాలు మెత్తబడ్డారు.. విభేదాలు మరిచి నగరంలో టిడిపి గెలుపుకు కృషి చేస్తామని ఈ ముగ్గురు నేతలు ప్రకటించారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement