విజయవాడ – తగిన అవకాశాలు లభిస్తే మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడగలుగుతారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సతీమణి, రాష్ట్ర ప్రధమ పౌరురాలు సుప్రవ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్ భవన్ లో సోమవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి రాజ్ భవన్ మహిళా ఉద్యోగులకు స్వయంగా ఆమె అందించారు. రాజ్ భవన్ మహిళా ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో స్త్రీలకు సమానమైన పాత్ర ఉందని ప్రపంచానికి తెలియజేసే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం భావించవచ్చని ఈ సందర్భంగా సుప్రవ హరిచందన్ అన్నారు. ఈ రోజు మహిళలందరికీ చాలా ముఖ్యమైన రోజని, దశాబ్దాలుగా సాగిన మహిళా ఉద్యమాల ఫలితంగా సాధించిన సమాన హక్కులను పరిరక్షించుకోవలసిన బాధ్యతను మనకు గుర్తు చేస్తుందన్నారు. ఈ సంతోషకరమైన క్షణాలను మీ అందరితో పంచుకోవడానికి తనకు అవకాశం లభించటం ముదావహమన్నారు. ఈ కార్యక్రమానికి రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి నాగమణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులకు సుప్రవ హరిచందన్ బహుమతులు అందచేసారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement