మచిలీపట్నం – వాణిజ్య బ్యాంకులలో ఆంధ్రా బ్యాంకు చారిత్రాత్మకమైనదని, తొలి సారిగా దేశంలో క్రెడిట్ కార్డులు జారీ చేసిన బ్యాంక్ కూడా ఆంధ్రా బ్యాంకేనని, మహనీయుని స్మృతిగా ఈ ప్రాంతంలోనే డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక మ్యూజియం ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రశంసించారు.మంగళవారం ఉదయం యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా సి ఇ ఓ , ఎం డి జి. రాజ్ కిరణ్ రాయ్ మచిలీపట్నంకు విచ్చేసారు. వ్యవస్థాపక బ్యాంకు సందర్శించి ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళి సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ,1923 నవంబరు 20 న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రా బ్యాంక్ మచిలీపట్నంలో స్థాపించారని భారతీయ బ్యాంకింగ్ రంగానికి సాంకేతికతను పరిచయం చేసిన ఆంధ్ర బ్యాంక్ ఈ గడ్డ మీద జీవం పోసుకోందని అయితే , కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆంధ్రా బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1 ఏప్రిల్ 2020 నుండి విలీనం అవుతోందని తెలిపారు. దీంతో దేశంలోనే 5వ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవతరించనుందన్నారు.. ఎంతో చారిత్రాత్మక నేపధ్యం కల ఆంధ్రా బ్యాంకు 1981లో క్రెడిట్ కార్డు లను జారీ చేయుటం ద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను పరిచయం చేసిన ఘనత సైతం ఉందన్నారు 2003 నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించి, 2007 లో బయోమెట్రిక్ ఏటిఎంలను భారతదేశానికి పరిచయం చేసింది ఆంధ్రాబ్యాంక్ మాత్రమే అని చెప్పారు దేశంలో తొలిసారిగా 1980 లో బ్యాంకుల జాతీయం చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న జాతీయ బ్యాంకులలో ఆంధ్రా బ్యాంకు ప్రధానమైనదని ఇలా ఎన్నో రికార్డులను సృష్టించిన ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరిట ఒక స్మారక మ్యూజియంను మచిలీపట్నంలో ఏర్పాటుచేయడం ఇక్కడ ప్రజలకు కొంతమేరకు ఊరట కలిగిస్తుందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ కార్యక్రమంలో బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, యూనియన్ బ్యాంకు జనరల్ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి , డెప్యూటీ జనరల్ మేనేజర్ కె .వి. రావు, మచిలీపట్నం రీజినల్ డైరెక్టర్ సన్యాసి రాజు, డెప్యూటీ రీజినల్ హెడ్ నందగిరి గురుచరణ్, ఫౌండర్స్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement