బాపులపాడు, పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన పార్టీ సీనియర్ నాయకుడు, చింతలపూడి నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ కర్రా రాజారావు లేని లోటు పూడ్చలేనిదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. టీడీపీ ఒక నిబద్దత కలిగిన నాయకుడిని కోల్పోయిందన్నారు. ఇటీవల మృతి చెందిన కర్రా రాజారావు కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కొత్తపల్లిలోని నివాసంలో బుధవారం పరామర్శించారు. కొత్తపల్లికి చెందిన కర్రా కుటుంబం పశ్చిమ గోదావరి జిల్లాలో స్థిపడింది. . రెండు దఫాలు చింతలపూడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) కుమారుడు, తెలుగుయువత అధ్యక్షుడు మాగంటి రాంజీ సంతాప సభలో చంద్రబాబు పాల్గొన్నారు. . అక్కడ నుంచి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడుతో కలసి చంద్రబాబు కొత్తపల్లి వెళ్లి డాక్టర్ కర్రా రాజారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాజారావు చిత్రపటానికి చంద్రబాబు, అర్జునుడు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజారావు భార్య, కుమారులతో చంద్రబాబు మాట్లాడి సంతాపం తెలియజేశారు. రాజారావు కుమారులు కర్రా క్రాంతి కుమార్, కార్తీక్ చైతన్య ఏమి చేస్తున్నారో ఆరా తీశారు. _అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కర్రా చేసిన కృషిని కొనియాడారు. . టీడీపీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని, రాజారావు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. . పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాలో టీడీపీ బలోపేతానికి కర్రా చేసిన కృషిని ఎన్నటికీ మరవలేమని చెప్పారు. అలాంటి నేతను నేటితరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. . కర్రా కుటుంబాన్ని పరామర్శించిన వారిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు ఇన్చార్జి గన్ని వీరాంజనేయులు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్ కోనేరు నాగేంద్రకుమార్, బాపులపాడు మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్, పార్టీ నాయకులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, మూల్పూరి సాయి కల్యాణి, వడ్డిలి లక్ష్మీ, తెలుగు యువత నాయకులు మండవ అన్వేష్, బడుగు కార్తీక్, కొమ్మినేని బాబీ, గండేపూడి నితీష్, గోకుల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement