Saturday, November 23, 2024

శ్రీశైలానికి దూసుకొస్తున్న కృష్ణమ్మ.. ఎగువ ప్రాజెక్టుల నుంచి 5లక్షల క్యూసెక్కుల వరద

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎగువన కర్ణాటక నుంచి తెెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపు 5లక్షల క్యూసెక్కులకు పైగా వరద దూసుకొస్తోంది. ఎడతెరిపి లేని భారీ వర్షాలకు ఎగువన కర్ణాటకలోని అలమట్టి, నారాయణపూర్‌, ఉజ్జయినీ, తుంగభద్ర ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. దీంతో కృష్ణమ్మ వరద దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు మీదుగా శ్రీశైలం వైపుకు పరవళ్లు తొక్కుతోంది. ఎగువున కర్ణాటకలోని అలమట్టి ప్రాజెక్టు నుంచి 1, 25, 000 క్యూసెక్కులు, నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి 1, 33, 188 క్యూసెక్కులు, తుంగ భద్ర నుంచి 1, 15, 266 క్యూసెక్కుల వరద వస్తోంది.

మంగళవారం ఎగువనుంచి వచ్చిన వరద జూరాల ప్రాజెక్టును దాటింది. జూరాల నుంచి 1, 07, 865 క్యూసెక్కుల వరదను శ్రీశైలం వైపునకు వదులుతున్నారు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9టీఎంసీల మేర వరద నీరు చేరడంతో శ్రీశైలంలోకి వరద ను అధికారులు వదులుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా… ప్రస్తుతం రిజర్వాయర్‌లో 46.51 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలానికి 41, 999 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. మరోవైపు నాగార్జునసాగర్‌కు 1277 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement