Tuesday, November 26, 2024

Krishna Water – ఎగువ రాష్ట్రాల‌లో జ‌ల చౌర్యం… దిగువ రాష్ట్రాల‌లో క‌ర‌వుకాట‌కం….

అమరావతి, ఆంధ్రప్రభ: కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోంది. ఎగువ రాష్ట్ల్రాలు అక్రమ ప్రాజెక్టులతో జలాలను తరలిస్తూండగా దిగు వనున్న ఏపీకి నీటిని తరలించేందుకు ఎగువ రాష్ట్రాలు నిర్మి స్తున్న అక్రమ ప్రాజెక్టుల ఊసెత్తకుండా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పున:పంపిణీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయ టం పట్ల సర్వత్రా విమర్శలు పెల్లుబికుతున్నాయి. కృష్ణాలో కొత్తగా అందుబాటు-లోకి వచ్చే అదనపు నీటి లభ్యతకు పరిమితమైన బ్రిజేష్‌ కుమార్‌ -టైబ్యునల్‌ (కృష్ణా జల వివాదాల పరిష్కారాల -టైబ్యునల్‌ – కేడబ్ల్యుడీటీ- -2)కు కొత్తగా ఏపీ, తెలంగాణకు కృష్ణా జలాల పున:పంపిణీ అధికారాలను దఖలు పరుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ మాత్రం హేతుబద్ధంగా లేదని జల వనరుల నిఫుణులు చెబుతున్నారు. ఏపీ సాగు, తాగునీటి హక్కులకు ఇది శరాఘాతం. ప్రత్యేకించి కరవు పీడిత ప్రాంతమైన రాయలసీమకు తీరని నష్టమని తెలిసినా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పున:పంపిణీకే కేంద్రం మొగ్గు చూపిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణాపై కర్ణాటకలో నిర్మిస్తున్న నవలి రిజర్వాయర్‌ దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ రైతాంగంలో దిగులు రేపుతోంది. బీజేపీ ప్రభుత్వం ఉండగా నవలి నిర్మాణ పనుల్లో వేగం పెరగగా ఇపుడు సిద్ధరామయ్య సర్కారు కూడా ఆ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. నవలి రిజర్వా యర్‌ను ఎలాగైనా కట్టి తీరాలన్న కర్ణాటక పంతం నెగ్గితే తుంగభద్ర, ఆ తరువాత శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో భారీ వరదల సమయంలో తప్ప నీటి ప్రవాహం కనబడే అవకాశం ఉండదని నిపుణులు చెబుతన్నారు.

52 టీ-ఎంసీల తరలింపు
తుంగభద్ర డ్యాంకు ఎగువన తుంగభద్ర డ్యాంకు ఎగువన నవలి రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టేందుకు కర్ణాటక సిద్ధమవుతోంది. ఇటీ-వల తుంగభద్ర బోర్డు చైర్మన్‌ రాయ్‌ పురే అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోనూ, గత ఏడాది బెంగుళూరులో ఏర్పాటు-చేసిన భేటీ-లోనూ ఏపీ అధికారులు తమ వాదనను బలంగా వినిపించారు. కర్ణాటక మాత్రం తుంగభద్ర పూడిక వల్ల కోల్పోతున్న నీటిని వినియోగించు కునేందుకు కొప్పళ జిల్లా నవలి వద్ద 52 టీ-ఎంసీల సామర్థ్యంతో చేపట్టే రిజర్వాయర్‌ నిర్మాణానికి అనుమతులివ్వాలనీ, దీనివల్ల తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని చెబుతోంది. 230 టీ-ఎంసీల తుంగభద్ర జలాల్లో బచావత్‌ -టైబ్యునల్‌ ద్వారా తమ వాటాగా దక్కిన 151.49 టీ-ఎంసీలను సద్వినియోగం చేసు కునేందుకు రిజర్వాయర్‌ నిర్మిస్తున్నట్టు- కర్ణాటక చెబుతోంది. తుంగభద్రలో పూడిక వల్ల నీరు వృధా అవుతోందనీ, కేటాయిం పుల మేరకు కృష్ణా జలాలను వినియోగించుకోలేక పోతున్నా మని ఆ రాష్ట్ర నీటిపారుదల ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ వాదనను ఎప్పటి నుంచో తోసిపుచ్చుతున్న ఏపీ తుంగభద్ర బోర్డుకు విస్పష్టమైన అభిప్రాయాలను వెల్లడించింది. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే తుంగభద్రకు ఎగువన తుంగ, భద్ర డ్యామ్‌, సింగటలూరు బ్యారేజ్‌, సింగటలూరు ఎత్తపోతల పథకాలను నిర్మించి కేటాయింపుల కన్నా అధికంగానే నీటిని తరలిస్తోంది. ఇపుడు కొత్తగా నవలి రిజర్వాయర్‌ నిర్మిస్తే కృష్ణా దిగువన ఉన్న తమ రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు దెబ్బతింటాయి. తుంగభద్ర డ్యాంలో నీటి సామర్థ్యంపై 2008లో చేసిన టోపోగ్రాఫిక్‌ సర్వేకూ, 2016లో చేసిన సర్వేకు నాలుగు టీ-ఎంసీల తేడా వచ్చింది. తుంగభద్ర డ్యాం నుంచి కర్ణాటక భారీగానే నీటిని తరలిస్తున్నట్టు- ఆధారాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తుంగభద్ర సామర్ధ్యం, కేటాయింపులు, వినియోగంపై సాంకేతికంగా నిర్దిష్టమైన గణాంకాలను వెల్లడించాలని బోర్డును ఏపీ కోరుతోంది.

తుంగభద్రలో తగ్గిన నీటి లభ్యత
తుంగభద్ర డ్యాంను 133 టీ-ఎంసీల సామర్దంతో నిర్మించగా డ్యాంలో నీటి లభ్యత 105.78 టీ-ఎంసీలకు తగ్గుముఖం పట్టినట్టు- టోపోగ్రాఫిక్‌ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎగువ నుంచి వచ్చే వరద జలాలను కూడా కలుపుకుని డ్యాంలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 230 టీ-ఎంసీలు అందుబాటు-లోకి వస్తాయని భావించి తుంగభద్ర బోర్డు మూడు రాష్ట్రాలకు కేటాయింపులు చేసింది. కర్ణాటకకు 151.49, ఏపీకి 72, తెలంగాణకు 6.51 టీ-ఎంసీలను కేటాయించింది. పూడిక వల్ల కోల్పో తున్న నీటిని మినహాయించి అందు బాటు-లో ఉన్న జలాలను దామాషా ప్రకారం ప్రతి ఏడాది తుంగభద్ర బోర్డు మూడు రాష్ట్రాలకు కేటాయిస్తోంది. కేటాయింపులను పట్టించుకోకుండా ఎగువ ప్రాజెక్టుల ద్వారా కర్ణాటక నీటిని తోడేస్తుందనీ, కేటాయింపులకు మించి నీటిని వాడుకుంటోందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి.

- Advertisement -

ఈ నేప థ్యంలో తుంగభద్రలో నీటి లెక్కలను తేల్చాకే నవలి రిజర్వా యర్‌ గురించి సమగ్రంగా చర్చిం చాలన్న ఏపీ వాదనకు తుంగభద్ర బోర్డు కూడా సానుకూలత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణాలో వాస్తవిక నీటి గణాంకాలు, వినియోగంపై లెక్కలు తేల్చే నవలి రిజర్వాయర్‌పై ముందుకు పోకుండా కర్ణాటకను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement