అమరావతి, ఆంధ్రప్రభ: చత్తీస్‌గఢ్ ఆమోదంతోనే గోదావరి-కావేరి అనుసంధా నంపై తుది ప్రణాళిక సిద్ధం చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ తెలిపారు. హైదరబాద్ లోని జలసౌధలో సోమవారం గోదావరి-కృష్ణా- పెన్నా-కావేరి అను సంధానంపై జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ డబ్ల్యుడీఏ) ఆధ్వర్యంలో భాగస్వామ్య రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి-కావేరి అనుసంధానం వల్ల తాము ఎక్కువగా నష్టపోతామని చత్తీస్‌గఢ్ భావిస్తోంది. చత్తీస్‌గఢ్ అనుమానాలను నివృత్తి చేసేందుకు త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి స్థాయిలో చర్చించనున్నట్టు- తెలిపారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం జాతీయ నదుల అనుసంధాన సంస్థ (నీరా)ను ఏర్పాటు- చేస్తున్నట్టు- శ్రీరామ్ తెలిపారు. గోదావరి-కావేరి అనుసంధానం మొదటి దశలో 141 టీ-ఎంసీల నీటిని తరలించే ప్రతిపాదన అమలు కోసం రూ 43 వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా..అనుసంధానం కోసం అదనంగా గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించినప్పటికీ వరదల ్ట 2| ఓ్లబ…
సమయంలో సముద్రంలో కలుస్తున్న కొన్ని వేల టీ-ఎంసీల్లో కొంత మేరకు తరలించినా గోదావరి-కావేరి అనుసంధానం ప్రక్రియ సాకారమవుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు- దేశంలోని ఎక్కడ ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టినా డ్రిప్ ఇరి గషన్ ను తప్పనిసరి చేయనున్నట్టు- శ్రీరామ్ తెలిపారు.
కేటాయింపు జలాలను తరలించం
గోదావరి, కృష్ణాలో ఏపీ, తెలంగాణకు కేటాయించిన నికర జలాలకు అనుసంధానం వల్ల ఎలాంటి నష్టం లేదని శ్రీరాం తెలిపారు. కేటాయింపులతో సంబంధం లేకుండా సముద్రం లో కలుస్తున్న అదనపు జలాలనే వినియోగించుకుంటామని తెలిపారు. తమ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆమోదించటంతో పాటు- తాము ఎక్కువ భూమిని కోల్పోతున్నందున గోదావరి-కావేరి అనుసంధానం ద్వారా అందుబాటు-లోకి వచ్చే నీటిలో సగ భాగాన్ని కేటాయించాలని తెలంగాణ కోరిందని తెలిపారు. కేవలం మిగులు జలాలతో అనుసంధానం చేపడితే తమకెలాంటి అభ్యంతరం లేదని కూడా వెల్లడించిందన్నారు. గోదావరి, కృష్ణాలో తమ వాటాలకు ఇబ్బంది లేకుండా అనుసంధాన ప్రక్రియను చేపట్టాలని ఏపీ కోరినట్టు- శ్రీరాం వెల్లడించారు. ఏపీ, తెలంగాణతో పాటు- మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు..ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే ఉన్న కేటాయింపులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్న హామీ ఇచ్చినట్టు- తెలిపారు. గోదావరి-కావేరితో పాటు- రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లకు ఉపయోగపడే పర్వతీ-చంబల్ నదుల అనుసంధానంపైనా సమావేశంలో చర్చించినట్టు- తెలిపారు. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ డబ్ల్యుడీఏ) చైర్మన్ భూపాల్ సింగ్ మాట్లాడుతూ దాదాపు అన్ని రాష్ట్రాలు గోదావరి-కావేరి అనుసంధాన ప్రక్రియకు సూత్రప్రాయ అంగీకారం తెలిపాయని వెల్లడించారు. సాంకేతిక అంశాలన్నిటినీ పరిశీలించి ఇప్పటికే సిద్ధమైన ప్రతిపాదన మేరకు ఇచ్చంపల్లికి సమీపంలోనే ఆనకట్ట నిర్మిస్తామని వెల్లడించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలతో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయనీ, చత్తీస్ ఘడ్‌తో చర్చలకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు- తెలిపారు.