Wednesday, November 20, 2024

సాగు, తాగు అవసరాలకే కృష్ణా జలాలు – తేల్చి చెప్పిన జలసంఘం

అమరావతి, ఆంధ్రప్రభ:కృష్ణా జలాల వినియోగంపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్రైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ రూల్‌ కర్వ్స్‌ (నిర్వహణ, నియమావళి)పై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు దిశా నిర్దేశం చేసింది. ఈ మేరకు విధి విధానాలతో కూడిన నివేదికను బోర్డుకు అందించింది. బచావత్‌ -టైబ్యునల్‌ కృష్ణాలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కేటాయించిన నికరజలాలను రెండు రాష్ట్రాల్రు వినియోగించుకోవాలి..సాగు, తాగునీటి అవసరాలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని బోర్డుకు స్పష్టం చేసింది. జలవిద్యుదుత్పత్తి, వరద జలాల మళ్ళింపుపైనా మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మేరకు శ్రీశైలం నీటి వినియోగంపై పూర్తి స్థాయి నివేదికనూ, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై ముసాయిదా నివేదికను బోర్డుకు అందించింది

సీడబ్ల్యూసీ మార్గదర్శకాల అమలుపై కృష్ణా బోర్డు త్వరలో రిజర్వాయర్‌ మేనేజ్‌ మెంట్‌ కమిటీ- (ఆర్‌ ఎంసీ) సమావేశం నిర్వహించనుంది. కృష్ణా బోర్డు సభ్యుడు రవికుమార్‌ పిళ్ళై అధ్యక్షతన ఏర్పాటయిన కమిటీ- లో రెండు రాష్ట్రాల్ర జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ)లు, జెన్‌ కో డైరెక్టర్లు సభ్యులుగా ఉన్నారు. ఆర్‌ ఎంసీ సమావేశా ల్లోఆమోదించిన తీర్మానాలను కృష్ణా బోర్డుకు అమల్లోకితీసుకురావాల్సి ఉంది. రెండు రాష్ట్రాల్ర మధ్య నీటి వివా దాలను పరిష్కరించేం దుకు గత ఏడాది మే 10న కృష్ణాబోర్డు ఆర్‌ ఎంసీని ఏర్పా టు- చేసినా ఏనాడూ పూర్తిస్థాయి సమా వేశం నిర్వహించలేదు. ఎక్కువ సార్లు తెలం గాణ అధికారులు గైర్హాజర య్యారు. సమా వేశంలో తీర్మానాలను ఆమోదానికి అంగీక రించి ఆ తరువాత సంతకాలు చేసేందుకు తెలంగాణ అధికారులు నిరాకరించారు.

దీంతో ఆర్‌ఎంసీలో చర్చలు, చోటు-చేసుకున్న పరి ణామాలపై సీడబ్ల్యూసీకి గత ఏడాది డిసెంబరులో నివేదిక అందిం చింది. ఈనెల 10 నిర్వహించిన కృష్ణా బోర్డు సమావేశంలో ఆర్‌ ఎంసీనీ మళ్లీ పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు ఆర్‌ ఎంసీ సమావేశాన్ని త్వరలోనే ఏర్పాటు-చేసి సీడబ్ల్యూసీ మార్గద ర్శకాల అమలుపై రెండు రాష్ట్రాల్రతో చర్చించనుంది.

ఇదే రూల్‌ కర్వ్స్‌
కృష్ణాలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నీటి పంపిణీ నిర్వహణ, నియమావళి (రూల్‌ కర్వ్స్‌) ముసాయిదాను బచావత్‌ -టైబ్యునల్‌ అవార్డుకు లోబడి రిజర్వాయర్‌ మేనేజింగ్‌ కమిటీ- (ఆర్‌ ఎంసీ) రూపొందించింది. ఇపుడు సీడబ్ల్యూసీ కూడా ఆర్‌ఎంసీ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. నీటి సంవత్సరంలో భాగమైన జులై 1 నుంచి అక్టోబరు 31 వరకు శ్రీశైలంలో కనీస నీటిమట్టాన్ని 854 అడుగులకు ఆర్‌ ఎంసీ నిర్దారించింది. ఆ సమయంలో 854 అడుగుల లోపు నీటి మట్టం నుంచి జలవిద్యుదుత్పత్తి చేయకూడదని ఆర్‌ఎంసీ గతంలో తీర్మానించింది. మిగతా రోజుల్లోనూ 815 అడుగులకు దిగువన విద్యు దుత్పత్తి కోసం నీటిని తీసుకోకూడదు. దిగువ ప్రాంతాల్లో సాగు, తాగునీ టి అవసరాలున్నప్పుడే విద్యుదు ద్పత్తి చేయాల్సి ఉంటు-ంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల పవర్‌ హౌస్‌ ను పర్యవేక్షణ కోసం పర్మినెంట్‌ స్టాండింగ్‌ కమిటీ- (పీఎస్‌ పీ) ఏర్పాటవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement