Friday, November 22, 2024

నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ భేటీ

కృష్ణానదీ యాజమాన్య బోర్డు కమిటీ సమావేశం ఈరోజు జరగనుంది. వర్చువల్ విధానంలో త్రిసభ్య కమిటీ స‌మావేశం కానుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నీటికేటాయింపులపై నిర్ణయం జరగనుంది. శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించవద్దని ఇటీవలే కమిటీ రెండు రాష్ట్రాలకు సూచించింది. కృష్ణా నదిలో నీటిమట్టం 809 అడుగుల పైన ఉందని, కనిష్ట వినియోగమట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటే 5.2 టీఎంసీలు మాత్రమే ఉంటాయని, వీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచించింది. విద్యుత్తు ఉత్పత్తికి శ్రీశైలం నీటిని వినియోగించవద్దని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement