Tuesday, November 26, 2024

TS : ఇవాళ‌ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స‌మావేశం

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇవాళ ప్రత్యేక సమావేశం కానుంది. ఆర్థికపరమైన అంశాలు, 2024-25 బడ్జెట్ ఆమోదం కోసం భేటీ కానుంది. ఛైర్మన్ శివనందన్ కుమార్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో ఈ సమావేశం జరగనుంది. ఇందులో రెండు రాష్ట్రాల ఈఎన్సీలు పాల్గొననున్నారు.

- Advertisement -

ఉద్యోగులు, సిబ్బందికి ఈ నెల వేతనాలు ఇచ్చేందుకు కూడా సరిపడా డబ్బులు లేవని, వెంటనే నిధులు విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇప్పటికే విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. 2024-25 సంవత్సరానికి కృష్ణా బోర్డు బడ్జెట్ను 23 కోట్ల 17 లక్షలకు తయారు చేశారు. బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలు, కార్యాలయ నిర్వహణ ఖర్చులు, టెలీమెట్రీ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు ఈ మొత్తం అవసరమవుతుందని అంచనా వేశారు. ఆ మేరకు నిధులు ఇవ్వాలని రెండు రాష్ట్రాలను బోర్డు కోరింది.

బోర్డుకు దాదాపు ఏడున్నర కోట్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిసిందని, అయితే నిధులు మాత్రం ఇంకా అందలేదని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ.11 కోట్ల తొమ్మిది లక్షలు, తెలంగాణ రాష్ట్రం 19 కోట్ల 64 లక్షల రూపాయలు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement