Saturday, November 23, 2024

రేపు కర్నూలులో కృష్ణాబోర్డు సభ్యుల పర్యటన.. తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్

కృష్ణా నది యాజమాన్య బోర్డు సభ్యులు గురువారం(ఆగస్ట్ 5) కర్నూల్ జిల్లాలో  పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇఎన్ సి అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వాస్తవంగా గత నెల 8 వ తేదీనే కృష్ణా బోర్డు సభ్యులు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఏపీ, తెలంగాణ రెండు  మధ్య జల వివాదాలు భగ్గుమని రగులుకుంటున్న నేపధ్యంలో కేఆర్ఎంబీ సభ్యులు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. ఈక్రమంలో వాయిదాల అనంతరం తిరిగి కృష్ణా బోర్డు సభ్యులు జిల్లాలో పర్యటించడం ఉత్కంఠ ఏర్పడింది.

ఏపీ ప్రభుత్వం తుంగభద్ర నదిపై ఆర్డీఎస్ వద్ద అక్రమంగా కుడి కాలువ నిర్మించి తుంగభద్ర నీటిని తరలించుకుపోయేందుకు కుట్ర చేస్తోందని, అలాగే కృష్ణా నదిపై అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం (సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్) ద్వారా కృష్ణా జలాలను తరలించుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ రెండు పథకాలు వెంటనే ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే.

మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా కృష్ణా బోర్డుకు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై ఫిర్యాదు చేసింది. కృష్ణా బోర్డుతోపాటు… కేంద్ర జల శక్తి శాఖకు.. ప్రధాని నరేంద్ర మోడీకి సైతం లేఖ రాసి వెంటనే జోక్యం చేసుకుని పరిష్కరించాలని కోరిన విషయం తెలిసిందే. అంతే కాదు రాయలసీమ ఎత్తిపోతల పథకంకు పర్యావరణ అనుమతులపై కోర్టుకు నివేదిక అందజేయల్సి ఉంది. ఈ క్రమంలో గురువారం కృష్ణా బోర్డు కమిటీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్నూలు జిల్లాలో కృష్ణా బోర్డు పర్యటన నేపధ్యంలో వారికి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: ఏపీ ఐటీ శాఖ దుస్థితి ఇది: లోకేష్

Advertisement

తాజా వార్తలు

Advertisement