Wednesday, November 20, 2024

ఏపీ శాసనమండలి చైర్మన్‌గా మోషేను రాజు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా కొయ్యె మోషేను రాజు కానున్నారు. చైర్మన్ పదవికి ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తప్ప మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో రాజు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మండలిలో ప్రొటెం స్పీకర్ బాలసుబ్రహ్మణ్యం.. రాజు ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు.

మరోవైపు చైర్మన్ పదవి కోసం తాము అభ్యర్థిని నిలబెట్టడం లేదని టీడీపీ సీనియర్ నేత యనమల ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

ఎమ్మెల్సీగా ఎంఏ షరీఫ్‌ పదవీకాలం ముగియడంతో మండలి చైర్మన్‌ పదవి ఖాళీ అయ్యింది. దీంతో మండలి చైర్మన్‌ ఎన్నికకు కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. చైర్మన్‌ పదవికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కొయ్యే మోషేన్‌రాజు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు.

కాగా, శాసనమండలి చైర్మన్‌ పదవి తొలిసారి ఎస్సీలకు దక్కనుంది. తొలి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎస్సీ వర్గానికి చెందిన కె.నారాయణస్వామిని ఉప ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే అదే వర్గానికి చెందిన మేకతోటి సుచరితను హోంశాఖ మంత్రిగా నియమించారు. తాజాగా మండలి చైర్మన్ పదవికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌ రాజును ఎంపిక చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement