శాసన మండలి ఛైర్మన్ గా కొయ్యే మోషేన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం ఛైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం జరిగిన శాసనమండలి సమావేశంలో ప్రకటించారు. శాసనమండలి ఛైర్మన్ పదవికి ఒకే నామినేషన్ దాఖలు అయిందన్నారు. శాసన పరిషత్ 9వ నియమం ప్రకారం మండలి ఛైర్మన్ నామ నిర్ధేశం జరిగిందన్నారు. కొయ్యే మోషేన్ రాజు అభ్యర్థితత్వాన్ని గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రతిపాదించగా సభ్యులు దువ్వాడ శ్రీనివాసరావు, బల్లి కళ్యాణ చక్రవర్తి బలపర్చినట్లు ప్రొటెం ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.
ఛైర్మన్ గా ఎన్నికైన మోషేన్ రాజును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, సభ్యులు చైర్మన్ సీటు వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఆయన శాసనమండలి ఛైర్మన్ సీటులోఆశీసునలయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు, శాసనమండలి సభ్యులు ఆయన్ను కలిసి అభినందించారు. ముందుగా శాసనమండలికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మోషేన్ రాజు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital