Monday, October 7, 2024

KNL: ఒకే పెన్సిల్ పై 9 అవతారాలతో జగన్మాత చిత్రాలు గీసిన కొటేష్‌

నంద్యాల బ్యూరో, అక్టోబర్ 7 (ప్రభ న్యూస్) : దసరా నవరాత్రులను పురస్కరించుకొని ఓకే పెన్సిల్ పై 9 జగన్మాత అవతారాలను చిత్రీకరించాడు నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్. హంస అవార్డు గ్రహీత కోటేష్ మాట్లాడుతూ… పెన్సిల్ పై మూడు వైపులా 9 చిత్రాలను గీశానని తెలిపారు. ఇందుకు అరగంట సమయం పట్టిందన్నారు.

గతంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా వంద మంది జాతీయ నాయకులను రక్తంతో చిత్రపటాన్ని గీసిన ఘనత చింతలపల్లి కోటేష్ కే దక్కింది. పెన్సిల్ పై 9 దేవత బొమ్మలు గీయడానికి గల కారణాన్ని వివరించారు. దుర్గామాత మహిషాసురునితో 9 రాత్రులు భీకరంగా యుద్ధం చేసి సంహరించింది. అందుకే ఈ దసరా పండుగకు నవరాత్రులు ఉత్సవాలతో పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇందుకు ప్రజలు 10వ రోజు సంతోషంగా జరుపుకునే పండుగ దసరా పండుగ అని నానుడి ఉంది. ప్రజలు సంతోషంగా జరుపుకునే పండుగ లలో దసరా పండుగ ముఖ్యమైనది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement