Tuesday, November 26, 2024

Breaking: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కోటంరెడ్డి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఏపీ రాజకీయాలను హీట్ పుట్టిస్తోంది. దీనిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నట్లు గతంలో టీడీపీ ఆరోపించగా.. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి తమ పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని వ్యాఖ్యానించడం ఏపీ పాలిటిక్స్‌లో సెగలు రేపుతోంది.

ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోటంరెడ్డి మరో స్టెప్ తీసుకున్నారు. దీనిపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బుధవారం కోటంరెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసి తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. ఈ రోజే కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపిస్తున్నానని, కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను చెప్పినప్పటినుంచి వైసీపీ నేతలు నన్ను టార్గెట్ చేశారని నన్ను అరెస్ట్ చేయిస్తాం అంటూ బెదిరిస్తున్నారని.. ఎన్నిసార్లు, ఎటువంటి బెదిరింపులకు పాల్పడినా నేను నిజాలు మాట్లాడుతునే ఉంటానని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement