Saturday, November 23, 2024

Breaking: కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

ఏపీలో ఉత్కంఠ రేపుతున్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండపల్లి మున్సిపాలటీలో మొత్తం 29 స్థానాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మున్సిపాలటీ పరిధిలోని 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు.. మరో 14 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీ కూడా గెలుపొందారు. అయితే స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీ టీడీపీకి మద్దతిస్తూ ఆపార్టీలో చేరారు. దీంతో టీడీపీ బలం 15కి పెరిగింది. దీంతో ఎక్స్‌ అఫీషియో ఓటు వినియోగించుకునేందుకు వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ, టీడీపీ ఎంపీ కేశినేని నాని సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. సభలో వైసీపీ అభ్యర్థులు గొడవ చేయటంతో  డిప్యూటీ కలెక్టర్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. వాయిదాపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా వాయిదా వేశారని ఆపార్టీ నేతలు ఆరోపించారు. ఎన్నిక వాయిదా న్యాయ నిబంధనల ఉల్లంఘనే అని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది.

కాగా, ఏపీలో ఇటీవల నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 నగరపంచాయతీ, గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అత్యధిక స్థానాల్లో వైసీపీ గెలుచుకోగా, మరొకొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు సత్తాచాటిన సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement