Thursday, September 12, 2024

AP | కోల్‌కతా ఘటన.. నిందితులను కఠినంగా శిక్షించాలి..

కర్నూలు, ప్రభ న్యూస్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, జూడాల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలు ప్రభుత్వాసుపత్రి నుంచి రాజవిహార్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం రాజ్‌విహార్ సెంటర్‌లో మానవహారం నిర్వహించి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పీజీ, ఎంబీబీఎస్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఆసుపత్రిలోని వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు. ఘటనపై సీబీఐతో విచారణ జరిపించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని, వైద్యుల రక్షణ కోసం కేంద్ర రక్షణ చట్టం అమలు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరారు. నాయకులు అచ్యుత్, పవన్ కళ్యాణ్, భరత్, భార్గవ్ పాల్గొన్నారు.

ఐద్వా మద్దతు

కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో ఏపీ జూడాలు చేపట్టిన ఆందోళనకు ఐద్వా మద్దతు తెలిపింది. ఆర్‌జికార్‌ హాస్పిటల్‌లో పీజీ డాక్టర్‌… రాత్రి 2 గంటల వరకు వైద్య సేవలందించి, విశ్రాంతీ తీసుకోవడానికి రూమ్‌ లేకపోవడంతో సెమినార్ హాల్‌లో నిద్రిస్తుండగా ఆమేపై సామూహిక అత్యాచారం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు, పిజిలు ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement