Friday, November 22, 2024

కోడి క‌త్తి కేసులో 15న ఎన్ ఐ ఎ కోర్టుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్

అమరావతి, ఆంధ్రప్రభ : సంచలనం కలిగించిన కోడి కత్తి కేసు విచారణలో ఎన్‌ఐఏ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసులో బాధితుడైన వైఎస్‌ జగన్‌ను విచారించేందుకు ఏర్పాట్లు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్ధ ఎన్‌ఐఏను ఆదేశించింది. ఇందుకోసం విక్టిమ్‌ షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేయాలని సూచించింది. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడికి సంబంధించిన కేసులో విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు మంగళవారం నుంచి విచారణ ప్రారంభించింది. సంఘటన జరిగిన దాదాపు నాలుగేళ్ళు కావస్తున్నా ఈ కేసులో ఇంతవరకూ విచారణ ప్రారంభం కాలేదని నిందితుడు తరుఫు న్యాయవాది సలీం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 16వ తేదీన ఎన్‌ ఐఏ కోర్టు 31వ తేదీ నుంచి విచారణ షెడ్యూల్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకా రం పది మంది సాక్షులతో కూడి న జాబితాను ఎన్‌ఐఏ తరుఫు ప్రాసిక్యూషన్‌ గత వాయిదా రోజున కోర్టుకు సమర్పిం చింది. దీని ప్రకారం జాబితాలో మొద టి సాక్షిగా దినేష్‌ కుమార్‌ను పేర్కొంది. అయితే బాధితుని కూడా విచారించాల్సి ఉన్నందు న కోర్టుకు హాజరపరిచే బాధ్యత తీసుకోవాలని అప్పుడే ఎన్‌ఐఏ ను కోర్టు ఆదేశించింది. ఈక్రమంలో మంగళవా రం నాటి ప్రారంభ విచారణకు తొలి సా క్షిగా విశాఖ విమానాశ్రయం అసిస్టెంట్‌ కమాండెంట్‌ దినేష్‌ కుమార్‌ హాజరు కావాల్సి ఉంది. ఘటన జరగ్గానే కేసు నమోదు చేసిన విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో దినేష్ ఫిర్యాదిగా ఉన్నారు. ఈ కేసును ఎన్‌ఐఏ తీసుకున్నాక ఎఫ్‌ఐఆర్‌లో దినేష్‌ను మొదటి ప్రత్యక్ష సాక్షిగా పేర్కొనడం జరిగింది. అయితే ఈయన విచారణకు గౖౖెర్హాజరయ్యారు. దినేష్‌ తండ్రి చనిపోవడంతో కోర్టుకు హాజరు కాలేకపోయారని అతని తరపు న్యాయవాది ఎన్‌ఐఏ కోర్టుకు తెలియచేశారు. దీంతో తదుపరి విచారణ ఫిబ్రవరి 15వ తేదీకి వాయిదా పడింది.

బాధితుడు కూడా రావాల్సిందే..
దాడికి గురైన బాధితుడిని కోర్టుకు హాజరుపర్చడంలో ఎన్‌ఐఏ తాత్సారంపై కోర్టు అసహనం వ్యక్తం చేసినట్లు నిందితుడు తరుఫు డిఫెన్స్‌ కౌన్సిల్‌ న్యాయవాది సలీం తెలిపారు. కేసు విచారణ ప్రారం భం సందర్భంగా నిందితుడు జనపల్లి శ్రీనివాసరావును రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విజయవాడ తీసుకువచ్చి ఎన్‌ఐఏ కోర్టుకు హాజరుపరిచారు. ఎన్‌ఐఏ పేర్కొన్న మొదటి సాక్షి దినేష్‌ గైర్హాజరుతో వాయిదా పడగా, మరోవైపు విక్టిమ్‌ (బాధితుడు) షెడ్యూల్‌ కూడా ఇవ్వా లని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో బాధితుడు జగన్‌ కావడంతో ఆయన కూడా కోర్టుకు వచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించాలని ఎన్‌ఐఏను జడ్జి ఆదేశించారు. తదు పరి విచారణను ఫిబ్రవరి 15కు వా యిదా వేసిన కోర్టు ఆరోజు విచా రణకు జగన్‌ రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్‌ఐఏ చార్జిషీటు- దాఖలు చేసిన చాలా కాలం తర్వాత కేసు విచారణ కు వచ్చింది. కేసు వా యిదా పడిన తర్వాత నిందితుడు శ్రీనివాసరావును తిరిగి జైలుకు తర లించారు.బాధితుడు జగన్మోహన్‌ రెడ్డి సైతం హాజరు కావాలని గతం లోనే ఎన్‌ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చెసినా ఢిల్లీలో పెట్టు-బడుల సన్నాహక సమావేశం ఉండటంతో ఆయన హాజరు కాలేద న్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement