టీడీపీ నేత నారా లోకేష్ పై మంత్రి కొడాలినాని మరోసారి విరుచుకుపడ్డారు. విభజన పార్లమెంట్ చట్టం ద్వారా జరిగిందని, 3 రాజధానులు కావాలంటే పార్లమెంట్ సవరణ చేయాలన్న లోకేష్ వ్యాఖ్యలను మంత్రి కౌంటర్ ఇచ్చారు. నారా లోకేష్ కు నాలెడ్జ్ లేదంటూ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో రాజధానిపై ఎప్పుడు చట్టం చేశారన్న ఆయన.. 175 జిల్లాలు చేయాలని లోకేష్ అనడం సిగ్గుచేటని విమర్శించారు. లోకేష్ కు అసలు నియోజకవర్గమే లేదని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
టీడీపీ నేతల రొటీన్ ప్రసంగాలు ఆపడం లేదన్నారు. బ్రాండ్లు ఎవరు తెచ్చారో ఆధారలతో సహా నిరూపించామన్నారు. డిస్టిలరీలకు అనుమతి ఇచ్చింది ఎవరు? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. బార్లు రద్దుపై కోర్టుకెళ్లి అనుమతులు తెచ్చుకున్నారని మండిపడ్డారు. తాము రద్దు చేస్తే 24 గంటల్లో కోర్టుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంట్లో దాక్కుని పనికిమాలిన ప్రెస్ మీట్లు పెడతారని విమర్శించారు. ఆరోపనణలు చేసేవాళ్లకు సిగ్గుండాలన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని ఎన్టీఆర్ గతంలోనే ప్రజలకు చెప్పారని అన్నారు. వెన్నుపోటు పేటెంట్ హక్కు చంద్రబాబుకే ఉందన్నారు. జగన్ తో యుద్ధం చేస్తే టీడీపీకి రాజకీయ సమాధే అని మంత్రి కొడాలి వ్యాఖ్యానించారు.