Saturday, November 23, 2024

ఖేల్‌ ఇండియాలో కేఎల్‌ విద్యార్థి ప్రతిభ.. రైఫిల్‌ షూటింగ్‌లో స్వర్ణ పతకం

అమరావతి, ఆంధ్రప్రభ: ఖేల్‌ ఇండియా రైఫిల్‌ షూటింగ్‌ విభాగం విశ్వవిద్యాలయం పోటీల్లో కేఎల్‌ డీవ్డ్‌ు యూనివర్సిటీ విద్యార్థి ఉమా మహేష్‌ సత్తా చాటాడు. బెంగుళూరులోని జైన్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ పోటీల్లో ఉమా మహేష్‌ బంగారు పతకం సాధించినట్లు విశ్వవిద్యాలయం అసోసియేట్‌ డీన్‌(స్పోర్ట్స్‌), కే.హరి కిషోర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేస్తూ తమ విశ్వవిద్యాలయంలో సిఎస్‌ఐటి విభాగంలో బీ-టె-క్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఉమా మహేష్‌ ఖేలో ఇండియా రైఫిల్‌ షూటింగ్‌ విశ్వవిద్యాలయ పోటీ-లలో బంగారు పతకం గెలుపొందినట్లు పేర్కొన్నారు.

స్పోర్ట్స్‌ కోటాలో 100శాతం ఫీజు రాయితీ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘనత సాధించిన ఉమమహేష్‌ ను విశ్వవిద్యాలయ యాజమాన్యం, ఉపకులపతి డాక్టర్‌ సారధి వర్మ, ప్రో వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఎన్‌. వెంకట్రామ్‌, ఇన్చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జగదీష్‌, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుబ్బారావు, విద్యార్థి విభాగ సంక్షేమ అధిపతి డీన్‌ డాక్టర్‌ హనుమంతరావు, వివిధ విభాగాల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement