అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్‌లో ఫెడరేషన్ నూతన అధ్యక్షులుగా కర్నూలు జిల్లాకు చెందిన జి. హృదయ రాజు, ప్రధాన కార్యదర్శిగా తిరుపతి జిల్లాకు చెందిన ఎస్. చిరంజీవి ఎన్నికయ్యారు. రెండ్రోజులపాటు జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో విద్యారంగ, ఉపాధ్యాయ, సామాజిక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. 3,4,5 తరగతులను హైస్కూల్‌లకు తరలించడం ఆపి ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని, సమాంతర మీడియంలను కొనసాగించాలని, సీబీఎస్‌ఈ సిలబస్ వద్దని, టీ-చర్స్, ప్రధానోపాధ్యాయులపై యాప్స్ భారం తొలగించాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేశారు.
సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, పీఎఫ్ లోన్స్, పదవీ విరమణ చేసిన వారికి అన్ని ప్రయోజనాలను మంజూరు చేయాలని కోరారు.మున్సిపల్ విద్య విలీనంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కోరారు. కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వహణ సమితి, ఇతర కమిటీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారని ప్రధాన కార్యదర్శి కె. కులశేఖర రెడ్డి తెల్పారు. 26 జిల్లాల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..