టెక్కలి : కేంద్ర సహాయ మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి సొంత పార్టీ అయిన కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరలా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే తాను పార్టీలో చేరాలా ? తన పెద్ద కుమారుడు కిల్లి విక్రాంత్‌ను రాజకీయాల్లోకి దింపాలా ? అనే సందిగ్ధ పరిస్థితుల్లో కృపారాణి ఉన్నట్లు తెలిసింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడిని కృపారాణి వైసీపీలో చేరారు. జిల్లా అధ్యక్షులుగా కొన్నాళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆమెకు వైసీపీలో ప్రాధాన్యత లేకపోవడంతో సొంత గూటికి వెళ్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఢిల్లీ, హైదరాబాద్‌ని పెద్దలతో మంతనాలు చేసినట్లు సమాచారం.