తిరుపతి – నేటి తెల్లవారుజామున తిరుపతి బస్టాండ్ లో కిడ్నాప్ కు గురైన రెండేళ్ల వయస్సున్న ఆరు మురుగన్ క్షేమంగా ఉన్నాడు.. బాలుడిని సురక్షితంగా ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో చేర్చారు.. వివరాలలోకి వెళితే చెన్నై, వరసవక్కం ,కు చెందిన రామస్వామి చంద్రశేఖర్ తన కుమారుడు అరుల్ మురుగన్ (2) తో కలసి శ్రీవారి దర్శనానంతరం తిరుగు ప్రయాణం కోసం తిరుపతిలోని చెన్నై బస్ స్టాప్ వద్ద సేదతీరాడు.. రాత్రి రెండున్నర గంటల సమయంలో కనపడకపోవడంతో వెంటనే తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు..బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద కేన్సస్ హోటల్ వైపు వెళ్లినట్టు సిసి పుటేజ్ ను పోలీసులు పరిశీలించారు..
ఇక ఈ బాలుడిని స్వంత బాబాయి సుధాకర్ తెల్లవారు ఝామున మూడున్నర గంటల ప్రాంతంలో ఆటోలో ఏర్పేడు మండలం మాధవమాల గ్రామంలో ఉన్న సుధాకర్ అక్క అయినా ధనమ్మకి అప్పగించారు. నేటి ఉదయం టివిలలో బాలుడి కిడ్నాప్ కు గురైనట్లు వార్తలు రావడంతో ధనమ్మ వెంటనే బాలుడు తన వద్ద ఉన్నట్లు గ్రామ సర్పంచ్ కరిముల్లాకు సమచారం ఇచ్చింది.. ఆ తర్వాత ఆ బాలుడిని ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.. పోలీసులు తిరుపతిలో ఉన్నతండ్రికి అప్పగించేపనిలో పడ్డారు.