హైకోర్టు గురువారం రాజధానిపై ఇచ్చిన తీర్పుపై ఏపీ మంత్రి అప్పలరాజు స్పందించారు. అమరావతి అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలన్నది జగన్ నిర్ణయమని చెప్పారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చారన్నారు. తమ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని అప్పలరాజు తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ కూడా జరగాలన్నారు. అందుకే జిల్లాల సంఖ్యను కూడా పెంచుకున్నామని తెలిపారు. రాజధాని కార్యకలాపాలను కూడా డీసెంట్రలైజ్ చేయాల్సి ఉందని అప్పలరాజు అన్నారు. రాజధానిలో ఉన్న కార్యకలాపాలను కూడా వికేంద్రీకరించాలని అప్పలరాజు అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయితేనే ప్రజల సమస్యలు తీరతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital