Saturday, November 23, 2024

AP | ఇళ్ల నిర్మాణంపై కీల‌క నిర్ణ‌యం..

ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నది. సోమవారం గృహనిర్మాణ శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు భూమిని కేటాయిస్తామని తెలిపారు.

అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం భూములు సేకరించి లేఅవుట్‌లు వేయని ప్రాంతాల్లో కూడా పేదలకు ఇళ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి ప్రస్తావించారు. జర్నలిస్టులకు కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు ఇళ్లు కట్టిస్తామ‌ని తెలిపారు. గత ప్రభుత్వం చాలా మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినా… అక్కడ మౌలిక వసతులు కల్పించలేదు… అలాంటి చోట మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement