Friday, September 13, 2024

AP: బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన కేశినేని చిన్ని

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : ప్రముఖ సినీ నటుడు, హిందూపురం నియోజకవర్గంలో మూడోసారి విజయం సాధించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పలువురు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.

విజయవాడ పార్లమెంటు సభ్యుడుగా అఖండ మెజారిటీతో గెలుపొందిన కేశినేని శివనాద్ బాలకృష్ణని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన బోండా ఉమామహేశ్వరరావు కూడా నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement