ఏపీ సీఐడీ కస్టడీలో తనను కొట్టారంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు రాసిన లేఖపై కేరళ ఎంపీ ప్రేమ్‌చంద్రన్ స్పందించారు. రఘురామపై సీఐడీ తీరును ఖండిస్తున్నట్టు తెలిపారు ఎంపీ ప్రేమ్ చంద్రన్. ప్రజాప్రతినిధిపై దాడి చేయడం అనాగరికమని ఆయన అభివర్ణించారు. ఇది క్రూరమైన, అమానవీయ చర్య అని, ఎంపీగా ఉన్న రఘురామను కొట్టడమంటే పార్లమెంట్‌ను అవమానించడమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్లమెంటుకు జరిగిన అవమానం అని ప్రేమచంద్రన్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో తప్పక లేవనెత్తుతానని తెలిపారు. ఈ అంశంలో ఎంపీ రఘురామకృష్ణరాజుకు మద్దతు ప్రకటిస్తున్నానని వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement