ఆక్వా ఉత్పత్తుల్లో అగ్రగా మిగా ఉన్న రొయ్యలకు ధీటు-గా చేపల సాగును కూడా ప్రోత్స హించేందుకు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) కోస్తా జిల్లాలపై దృష్టి కేంద్రీకరించింది. అనువైన నేల, నీరు..ఇతర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక ప్రాంతానికి పరిమితమవు తున్న చేపల సాగును ఇతర ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళిక రూపొందించింది. అధిక దిగుబడులు, లాభాలు, దేశీయ వినియోగంతో పాటు- విదేశీ ఎగుమతులకు అనువైన ఎంపిక చేసిన చేపల సాగుకు పూర్తిస్థాయిలో సాంకేతిక సహకారం అందిస్తోంది. దీనిలో భాగంగానే కేరళలో పేరుగాంచిన కరిమీన్ చేపల సాగు రాష్ట్రంలోని కోస్తా జిల్లాలకు పరిచయం చేస్తోంది. కృష్ణా జిల్లాలో కరిమీన్ పైలట్ ప్రాజెక్టు అనూహ్యరీతిలో విజయం సాధించటంతో ఇపుడు ఉభయ గోదావరి నుంచి విశాఖపట్టణం తీర ప్రాంతం వరకు కరిమీన్ సాగుకు సీఎంఎఫ్ఆర్ఐ సన్నాహాలు చేస్తోంది. కృష్ణా జిల్లా నాగాయలంక ప్రాంతంలో ఐసీఎఆర్-సీఎంఎఫ్ఆర్ఐ సహకారంతో ప్రారంభమైన కరిమీన్ సాగుకు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) సాగుదారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. అయిదు వేల చేప పిల్లలతో ప్రారంభమైన ఒక యూనిట్ సాగులో కనిష్టంగా 100, గరిష్టంగా 160 గ్రాముల పరిమాణంతో కూడిన 500 పైగా చేపలు దిగుబడి కావటంతో సాగుదారులు భారీ లాభాలు ఆర్జించారు.
కేరళ రాష్ట్రంలో విపరీతమైన డిమాండ్ ఉన్న కరిమీన్ ను అక్కడికే ఎగుమతి చేసే మార్కెట్ అవకాశాలు కూడా పెరగటంతో ఈ చేపల సాగుకు ఆసక్తి పెరుగుతోంది. ఏ సీజన్ లో అయినా సాగు చేసేందుక కరిమీన్ అనుకూలంగా ఉంటుంది.. సహజంగా ఉప్పునీటిలో పెరిగే కరిమీన్ మంచినీటి చెరువుల్లోనూ, సముద్రంలోనూ కూడా జీవిస్తోందని సీఎంఎఫ్ ఆర్ఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి, విశాఖ తీరంలోనూ ఎంపిక చేసిన ప్రాంతాల్లో సాగును విస్తరింప చేసేందుకు సీఎంఎఫ్ఆర్ఐ ప్రణాళిక సిద్ధం చేసింది. పంటల సాగుకు ఏ మాత్రం అనుకూలత లేని భూములను ఎంపిక చేసుకుని కరిమీన్ సాగు చేపట్టటం ద్వారా అక్కడి రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరు ఏర్పాటు-చేసినట్టవుతుందని అధికారులు చెబుతున్నారు. ఎట్రోప్లస్ సురా-టె-న్సిస్ సాంకేతిక నామంతో కేరళ కొరమీన్ గా పిలుస్తున్న ఈ చేప విత్తన సాంకేతికత, అభివృద్ధిని సీఎంఎఫ్ఆర్ఐ-కొచ్చిన్, సీఐబీఏ-చెన్నై పర్యవేక్షిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్పేజీలను ఫాలో అవ్వండి..