రచయిత పెనుకొండ లక్ష్మీనారాయణను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. “దీపిక” అభ్యుదయ వ్యాస సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
పల్నాడు జిల్లా చెరువుకొమ్ముపాలెంకు చెందిన పెనుకొండ లక్ష్మీనారాయణ దాదాపు 46 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. కాగా, ప్రస్తుతం అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.