Friday, November 22, 2024

ప్రజా సమస్యలు పరిష్కరించటం సంతోషంగా ఉంది – ఎమ్మెల్యే కేతిరెడ్డి

ధర్మవరం: మే 17 ప్రభ న్యూస్. – ప్ర జా సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం గడపగడపకు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగానే తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బుధవారం 30 వార్డులో గడపగడప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పేదవారైతే చాలు అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని వారు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని ఆప్యాయంగా ప్రజల్ని ఎమ్మెల్యే అడుగుతూ ముందడుగు వేస్తున్నారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు సీసీ రోడ్లు డ్రైనేజీలు లేకపోవడంతో చిన్నపాటి వర్షం వచ్చిందంటే ఇళ్లలోకి నీరు చేరుతున్నాయని వారు ఎమ్మెల్యేకు తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ వార్డులో ఇప్పటికే డ్రైనేజీ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాణం పూర్తి అయిన వెంటనే సిసి రోడ్లు కూడా తప్పక వేయిస్తామని తెలిపారు. అంతేకాకుండా సాంకేతిక తప్పిదాల కారణంగా ఇంటి పట్టాలు, పెన్షన్లు రావడం లేదని చెప్పడంతో సచివాలయ సిబ్బంది, హౌసింగ్ అధికారులతో ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని వారు ఆదేశించడం జరిగింది.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో 12 వేలకు పైగా ఇల్లు లేని పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేశామని జగనన్న కాలనీలో 1. 50 సెంట స్థలములో మగ్గం షెడ్డు నిర్మాణానికి, అనుకూలంగా ప్రభుత్వం ఇల్లు నిర్మిస్తుందని తెలిపారు. అదేవిధంగా వైయస్సార్ ఆసరా పథకం ద్వారా ప్రతి సంవత్సరం డ్వాక్రా అక్కాచెల్లెళ్లకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబము అభివృద్ధి బాటలో నడవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement