విశాఖలో ఓ స్వామీజీ ఘాతుకు వెలుగులోకి వచ్చింది. ఓ ఆశ్రమంలో బాలికపై స్వామీజీ లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఇవ్వాల (సోమవారం) బయటపడింది. చిన్నప్పుడే ఆ బాలిక తల్లిదండ్రులను కోల్పోయి ఆశ్రమంలో పెరుగుతోంది. పన్నెండేండ్ల వయస్సులోనే ఆశ్రమానికి చేరినట్టు సమాచారం.
కాగా, కీచక స్వామి ఘాతుకంతో బాలిక నరకం అనుభవించినట్టు తెలుస్తోంది. స్వామీజీ చెర నుంచి తప్పించుకున్నట్టు సమాచారం. ఇక.. స్వామి సంపూర్ణానంద కామ లీలలతో బాలిక విసిగిపోయి పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.