కీచక డాక్టర్.. బాగోతం బట్టబయలు…
ఎన్టీఆర్ జిల్లాః ఎన్టీఆర్ జిల్లాలో ఓ వైద్యుడి వైద్య వృత్తికే కళంకం తెచ్చాడు. రోగులకు ఆరోగ్య సేవలు అందించి వారి బాగోగులు చూడాల్సిన బాధ్యతను మరిచాడు. వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే మహిళలపై వేధింపులకు పాల్పడుతూ వైద్యవృత్తికే మచ్చ తెచ్చాడు ఓ వైద్య ప్రబుద్ధుడు.
విస్సన్నపేటలోని కీర్తన హాస్పిటల్, జనరల్ హాస్పిటల్‌లో వైద్యుడిగా సీతారం విధులు నిర్వహిస్తున్నారు. వైద్య చికిత్స కోసం వచ్చే రోగులతో మర్యాదగా నడుచుకొని రోగం నివారించే బాధ్యతను మరిచాడు. వైద్య వృత్తి ముసుగులో ఆసుపత్రికి వచ్చే మహిళలతో అసభ్యంగా, ఆమర్యాదగా ప్రవర్తించేవాడు. చాలా రోజులుగా జరుగుతున్న ఈ విషయం బయటకు పొక్కలేదు. ఏదో ఒక రోజు చేసిన పాపం పండుతుంది అన్న నానుడి నిజమే కావచ్చు. ఇంతకాలానికి వైద్యుడు టి. సీతారం బండారం బట్టబయలైంది. తాజాగా ఓ మహిళ చికిత్స కోసం రాగా ఆమెతో సోమవారం అర్థరాత్రి సీతారం అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేశాడు. ఆమె ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు కోపోద్రుక్తులైన బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈఘటన విషయం తెలుసుకున్న పోలీసులు సీతారం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ టి.సీతారాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి వైద్యశాలకు ప్రభుత్వ ప్రధాన వైద్యులుగా పనిచేస్తున్నారు.