కావలి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో క్లీనర్ మృతి చెందగా.. 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి వద్ద చోటుచేసుకుంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
మెరుగైన వైద్యం అందించండి – మంత్రి నారా లోకేశ్
కావలిలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాద ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ”పాఠశాల బస్సును లారీ ఢీకొని క్లీనర్ చనిపోవడం బాధాకరం. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించా. పాఠశాల యాజమాన్యాలు బస్సులు సరిగా నిర్వహించాలి. బస్సుల ఫిట్‌నెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి” అని అధికారులకు లోకేశ్ సూచించారు.