Friday, November 22, 2024

క‌వ‌చ్‌.. ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్ష‌న్‌.. ఇక రైళ్లు ఢీకొన‌య్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రైళ్లు ఢీకొనడాన్ని నివారించేందుకు దేశీయంగా రూపొందించిన వ్యవస్థ ‘కవచ్‌’ ప్రాజెక్టుపై రైల్వే బోర్డు డైరెక్టర్‌ జనరల్‌(భద్రత) రవీందర్‌ గుప్తా, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యతో కలిసి సమీ క్షించారు. జోన్‌ పరిధిలో భద్రత, ట్రెయిన్‌ కొలిజన్‌ అవార్డుునెన్స్‌ సిస్టం (టీసీఏఎస్‌) ‘కవచ్‌’ ప్రాజెక్టు అమలు తీరుపై సికింద్రాబాద్లోని రైల్‌ నిలయం నుంచి సోమవారం నిర్వహించిన సమావేశంలో వివిధ విభాగాల అధిపతులతోపాటు విజయవాడ, గుంతకల్‌, గుంటూరు, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నాందేడ్‌ డివిజినల్‌ రైల్వే మేనే జర్లు(డీఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.

డైరెక్టర్‌ జనరల్‌ రవీందర్‌ గుప్తా మాట్లాడుతూ జోన్‌ పరిధిలో రైళ్లు ఢీకొనడాన్ని నివారించే ‘కవచ్‌’ వ్యవస్థ అమలు తీరుతెన్నులపై చర్చించారు. రైళ్లు ఢీకొనడాన్ని నివారించేందుకు దేశీయంగా రూపొందించిన ఆటోమెటిక్ ట్రెయిన్‌ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థ, సిగ్నల్‌ డిస్‌ప్లేతో సహా అప్డేట్‌ అంశాలు, అధిక వేగం నిరోధం, లెవల్‌ క్రాసింగ్స్‌ వద్ద ఆటోమె టిక్‌ విజిల్‌ శబ్దం రావడం, అత్యవసర సమయాల్లో ఎస్‌ఓఎస్‌ సందేశాల వ్యవస్థపై మాట్లాడారు.

ఈ విధానం అభివృద్ధి, ప్రయోగాలపై అధికారుల, సిబ్బంది కృషి, బృందం పనితీరును అభినందించారు. భద్రతా విధానాల అంశాలపై ఆయన పలు సూచనలు చేశారు. శీతాకాలం దృష్ట్యా ట్రాక్‌ నిర్వహణలో మెరుగైన జాగ్రత్తలు తీసుకోవాలని, తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. కీలకమైన సెక్షన్లలో పాయింట్లు-, క్రాసింగ్‌, వంతెనల మార్గాలు వంటి చోట్ల క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశి ంచారు. రోడ్‌ అండర్‌ బ్రిడ్జీ(ఆర్యూబీలు)ల వద్ద నీరు నిల్వ ఉండకుండా రెండు రకాల ఎత్తుగల సబ్వేల ఏర్పాటు-, ప్రైవేట్‌ సైడింగ్స్‌ వద్ద వీడియో నిఘా వ్యవస్థతో సీసీ టీవీ కెమరాల ఏర్పాటు, లోకో సిబ్బందికి శిక్షణ పటిష్టంగా అమలు చేస్తున్నట్లు జీఎం వివ రించారు.

ఎలాంటి పరిస్థితుల్లో అయినా అవాంఛనీయ ఘటనలు ఎదురైతే ఎదుర్కోవడానికి నిరంతరంగా తనఖీలు నిర్వహించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య ఆరు డివిజన్ల అధికారులకు సూచించారు. భద్రతా మార్గదర్శకాలపై అప్రమత్తంగా ఉంటూ కచ్చితంగా పాటించాలని ఆయన సిబ్బందికి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement