సినీ, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలం ఎల్లమందలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ రోజు సాయంత్రం కత్తి మహేష్ పార్థివదేహాన్ని చెన్నై నుండి ఎల్లమందకు చేరుకోనుంది.
కాగా, జూన్ 27న ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.. తల, కళ్లకు తీవ్రగాయాలు కావడంతో శస్త్రచికిత్స నిర్వహించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్న ఆయన శనివారం పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ. 17 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. అయినా కూడా లాభం లేకపోయింది. దాదాపు 14 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న కత్తి మహేష్.. జులై 10న తుదిశ్వాస విడిచాడు. అయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మృతి పట్ల తెలుగు సినిమా పరిశ్రమతో పాటు మీడియా సైతం సంతాపం తెలియజేసింది. కత్తి మహేష్.. హృదయం కాలేయం, కొబ్బరిమట్టతోపాటు పలు చిత్రాల్లో నటించగా `బిగ్‌బాస్`షో ఆయనకు మరింత గుర్తింపుని తెచ్చుకున్నారు.