ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంధ్రనాథ్ రెడ్డి నేడు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు. అనంతరం మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఘనంగా వీడ్కోలు వేడుక నిర్వహిస్తారు. కాగా, ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఇప్పటికే ప్రభుత్వం నియమించింది.
1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా, విశాఖ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. అలాగే హైదరాబాద్‌లో డీసీపీగా కూడా విధులు నిర్వర్తించారు. పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఎండీగా పనిచేశారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా.. కీలక కేసుల్లో ముఖ్య భూమిక పోషించారు. సర్వీస్‌లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన ఇంటిలిజెన్స్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఫిబ్రవరి 15న డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.