Friday, November 22, 2024

kasimkota – తల సేమియా బాధితులకు అండ‌గా జ‌గ‌న్… త‌క్ష‌ణసాయంంగా రెండు లక్ష‌లు అంద‌జేత

కశింకోట, అక్టోబర్ 16(ప్రభ న్యూస్): ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు తల సేమియా వ్యాధితో బాధపడుతున్నారు. వీరికి వైద్యం అందించే స్తోమత తల్లికి లేకపోవడంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. కసింకోట మండలం విస్సన్నపేట గ్రామానికి చెందిన నడిశెట్టి గుణసాగర్ (13), నడిచెట్టి లోకేష్ (11) పుట్టిన రెండో సంవత్సరం నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ బాధ్యత తీసుకుని తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులను ముఖ్యమంత్రి సభా ప్రాంగణము వద్దకు తీసుకువచ్చారు. సభ ముగించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్న సమయంలో మంత్రి అమర్నాథ్ ఈ చిన్నారులను ఆయనకు చూపించారు. వెంటనే ఆయన చిన్నారులను చూసి ముఖ్యమంత్రి చెలిoచిపోయారు.

బిడ్డల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వీరికి వైద్య సహాయం అందించాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని సంబంధిత వ్యక్తులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో స్పందించిన ఆయన చరో లక్ష రూపాయలు తక్షణ సహాయం కింద ఆ కుటుంబానికి అందించాలని కలెక్టర్ రవి పటాన్చెట్టిని ఆదేశించారు. అలాగే మెరుగైన వైద్యం అందించేందుకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాధితులు తల్లి నడిశెట్టి లక్ష్మికి భరోసా ఇచ్చారు. వీలైనంత త్వరగా వీరికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని ముగించుకుని కార్యాలయానికి చేరుకున్న కలెక్టర్ నడిశెట్టి లక్ష్మికి రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తమ బిడ్డలకు ఈ సహాయం అందించిన మంత్రి అమర్నాథ్కు లక్ష్మి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గ్రామ సర్పంచ్ యు.మాణిక్యం అప్పారావుకు కూడా వారు ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement