శ్రీకాకుళం, ప్రభన్యూస్: కార్తీక వనభోజనాలు ఏ రోజైన చేయవచ్చు. అయితే మారుతున్న కాలంబట్టి ఉపాధికోసం ప్రజలు ఉద్యోగాలు చేసుకుంటూ రావడంతో ఉద్యోగులకు సెలవు రోజు అయిన ఆదివారం రోజునే ఈ వనభోజనాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు కుల, మత బేధాలు లేకుండా ఒక వీధివారు, స్నేహితులు, కొన్ని వర్గాల వారు ఈ వనభోజనాలకు వెళ్లేవారు. అయితే రెండున్నర దశాబ్దాలకు పైగా ఈ విధానం మరిపోయింది. సామాజిక వర్గాల వారీగా ఇప్పుడు ఎక్కువగా పిక్నిక్ లు జరుగుతున్నాయి. ఏది ఏమయినప్పటికీ కార్తీకమాసంలో అన్ని ప్రాంతాలలోని తోటలు పిక్నిక్ లతో సందడిగా కనిపిస్తూ వచ్చాయి.
అయితే గత సంవత్సరం కరోనా కారణంగా కార్తీక మాసంలో పిక్నిక్ లు జరగకుండానే గడచిపోయింది. గంటసంవత్సరం తోటలు, సముద్ర, నదీ తీర ప్రాంతాలు పిక్నిక్ లు లేకపోవడంతో వెలవవెల బోయాయి. ఈ సంవత్సరం కరోనా కేసులు తక్కువగా ఉండటం, ఎటు-వంటి ఆంక్షలు లేకపోవడంతో ఈ ఆదివారం వనభోజనాలు పెద్దఎత్తున జరిగాయి. వనభోజనా లతో పాటు- నదులలోనూ, సముద్రాలలోనూ స్నానాలు కూడా ఆచరిస్తూ రావడం ఒక సాంప్రదాయమైంది. అందుకే ఎక్కువమంది నదీ, సముద్ర తీరప్రాంతాలలో తోటలకు వెళ్ళడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతూ వస్తున్నారు.
గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital