చిత్తూరు జిల్లాలో కర్ణాటక మద్యం అక్రమ రవాణా, అమ్మకం పైన చిత్తూరు జిల్లా ఎస్పీ ఎస్.సెంథిల్ కుమార్ (ఐపిఎస్) ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్ ఎస్ఈబీ వి.విద్య సాగర్ నాయుడు, (ఐపీఎస్) స్వీయ పర్యవేక్షణలో చిత్తూరు డీఎస్పీ యన్ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో దాడులు నిర్వహించారు. ఈ కార్యాచరణలో భాగంగా వచ్చిన రహస్య సమాచారం మేరకు చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కే.బాలయ్య, చిత్తూరు తాలుకా సబ్-ఇన్ స్పెక్టర్ వి.రామక్రిష్ణయ్య, సిబ్బందితో కలసి 27.12.2021 వతేది రాత్రి 7 గంటలకు చిత్తూరు-వేలూరు రోడ్డులో మాపాక్షి మలుపు వద్ద వాహనములను తనిఖీ చేస్తుండగా వేలూరు వైపు నుండి చిత్తూరు వైపుగా వస్తున్న ఒక అనుమానాస్పదంగా ఉన్న పాల మినీలగేజి వాహనాన్ని అదుపులో తీసుకొని తనిఖీ చేయగా అందులో అక్రమంగా రవాణా చేస్తున్న 200 కేసులు (10000 సిల్వర్ కప్ వీఎస్ఓపీ బ్రాంది బాటిళ్లు) కర్ణాటక మద్యంను గుర్తించి అందులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకోవడమైనది.
విచారణలో ముద్దాయిలు నిషేధిత కర్ణాటక మద్యంను కర్ణాటక రాష్ట్రం నుండి ఏపీకి అక్రమంగా భారీ ఎత్తున రవాణా చేసి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించినట్లుగా, వీరిపై జిల్లాలో అనేక కేసులు ఉండి జైలుకు కుడా వెళ్లి వచ్చినట్లు తెలిసింది. సదరు ముద్దాయిలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కే.బాలయ్య, చిత్తూరు తాలుకా పోలీస్ స్టేషన్ సబ్-ఇన్ స్పెక్టర్ వి.రామక్రిష్ణయ్య, చిత్తూరు తాలుకా పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించారు. పుణ్య సముద్రం కార్తీక్ (24), రాళ్లపల్లి సురేష్ బాబు (36)లను అరెస్ట్ చేయగా, ప్రధాని నిందితుడైన చిత్తూరు ఉమాశంకర్ రెడ్డి, చిత్తూరు చక్రి, అరగొండ ప్రతాప్ నాయుడు, బెంగళూరుకు చెందిన వేణులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital