కర్నాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన అయిదుగురు విద్యార్థులు మరణించారు.రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
కర్ణాటకలోని సింధునూరు సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు సహా డ్రైవర్ అక్కడిక్కడే చనిపోయారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఓ విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని.. కేసు నమోదు చేసుకున్నారు.
మంగళవారం రాత్రి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు (14 మంది) కర్ణాటకలోని హంపి క్షేత్రానికి సమీపంలోని శ్రీ నరహరి తీర్థుల బృందావనంలో పూజలకు బయల్దేరారు. సిందనూరు వద్ద చక్రాల బోల్టులు ఊడిపోవడంతో కారు అదుపు తప్పింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర.. డ్రైవర్ శివ అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స పొందుతూ మరో విద్యార్థి హాస్పిటల్ లో మరణించాడు.
ఈ ఘటనలో మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సింధనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు మంత్రి సూచించారు. కర్నాటక ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసుల మృతి చెందడంతో.. అధికారులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తుపాన్ వాహనం టైరు పేలడంతో బోల్తా బడింది. ఆ సమయంలో వాహనం వేగంగా ఉండడంతో.. విద్యార్థులకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మరణించారు. మరణించిన వారందరూ కర్నూలు జిల్లాకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసిన కర్నూలు ఎంపీ..
రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాల విద్యార్థుల మృతిపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ఈ ఘటనపై ఎంపీ మంత్రాలయం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన పర్యటనలో భాగంగా ముంబైలో ఉన్న ఎంపీ రోడ్డు ప్రమాదంపై మంత్రాలయం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులతో ఫోన్ లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. దైవ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. ఇక మృతులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తాను అండగా ఉండి అన్ని విధాలా ఆదుకుంటామని ఎంపీ నాగరాజు హామీ ఇచ్చారు.