తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… సనాతన ధర్మం మానవాళి మంచి కోరుకుంటుందన్నారు. వేదాలే జీవితంలో సత్మార్గానికి దారి చూపుతుందన్నారు. మనిషి ఆచరించాల్సిన నియమాలు, చేయకూడని పనులు సనాతన ధర్మం చెప్తుందన్నారు. విశ్వశాంతికి భారతదేశం ముందడుగు వస్తుందన్నారు. ధర్మప్రచారం చేయడం ద్వారా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
ధర్మపరిరక్షణకు కేంద్ర బిందువు తిరుమల తిరుపతి దేవస్థానమన్నారు. నిర్వాహకులు, భక్తులు తిరుమల తిరుపతి క్షేత్రాన్ని పవిత్రంగా, శాంతిగా ఉంచేలా సహాయ సహకారాలు అందించాలన్నారు. ధర్మప్రచారానికి నూతన పాలకమండలి కంకణ బద్దులై ఉన్నారన్నారు. ప్రతి గ్రామంలో ధర్మప్రచారం చేపట్టేలా కృషి చేయాలన్నారు. దేవస్థానం ద్రవ్యాన్ని ధర్మ పరిరక్షణ కోసం వినియోగించాలన్నారు.
జనవరి 15 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు గంగాతీరంలో కుంభ మేళా జరగనుందన్నారు. ఈ కుంభమేళాలో ధర్మప్రచారం కోసం టీటీడీ నమూనా దేవాలయం, వేదపారాయణం, హోమాలు, స్వామి వారి ప్రసాదాలు అందించనుందన్నారు. కుమారధార నుంచి గంగాధార వరకు సనాతన ధర్మం కార్యక్రమం చేపట్టిందన్నారు.