Thursday, November 21, 2024

AP | కనకదుర్గమ్మ కుంకుమ పరిమళాల సోగసులే ‘సౌభాగ్య ‘

విజయవాడ, ( ఆంధ్రప్రభ ప్రతినిధి) : అమ్మవారికింపైన భక్తి రసాత్మకమైన మంత్రవైభవాలతో సుమారు నూటయాభై పేజీలతో ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనం ‘సౌభాగ్య’ అనే అపురూప గ్రంథాల్ని లక్ష ప్రతులు బెజవాడ కనకదుర్గమ్మకు సన్నిధానానికి ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, శ్రీమతి సుజాత దంపతులు తెలుగు ఉగాది పర్వదినంనాడు సమర్పించబోతున్నారు.

ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర దేవస్థానంగా కోట్లాది భక్తుల్నిసంరక్షిస్తున్న తెలుగువారి ఇలవేల్పు కనకదుర్గమ్మకు ఇప్పుడున్న కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు పరమ సంస్కార సంపన్నులు కావడంతో తాము ఇలాంటి సమయంలో అందించే లక్ష ప్రతులు అమ్మకు చేరవేయడంలో ఆయన చూపే శ్రద్ధ , భక్తి కూడా చాలా ముఖ్యంగా కృష్ణయ్య భావిస్తున్నారు.

చల్లని తల్లి కనకదుర్గమ్మపై బ్రహ్మాన్డ పురాణంలోని , శ్రీదేవీ భాగవతంలోని కొన్ని ప్రధాన స్తోత్రాలతోపాటు … దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి నిత్యం చేసే స్తోత్రాలతో … వేవేల సౌందర్యాల వ్యాఖ్యానాలతో ఈ రమణీయ గ్రంధానికి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలన కర్తగా వ్యహరిస్తున్నారు.

కుంకుమార్చనలలో పాల్గొనే దంపతులకు, దేవస్థానానికి అన్నదాన పథకంతో పాటు వివిధ అంశాలకు విరాళాలిచ్చే దాతలకు ఈ చిన్ని దివ్య మంగళ గ్రంధాన్ని ఉచితంగా అందించే ఉద్దేశ్యంతో వెలువడుతున్న ఈ అంశమై ఇంద్రకీలాద్రి దేవస్థాన జాయింట్ కమీషనర్ కి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే శ్రీపూర్ణిమ, శ్రీమాలిక, శ్రీలహరి, యుగే .. యుగే , అమృతధార, అమృత వర్షిణి , మహామంత్రస్య … వంటి ఎన్నో అత్యద్భుత దైవీయ చైతన్య గ్రంధాలను తెలుగు రాష్ట్రాలకు అపురూపు సొగసులతో అందించిన పురాణపండ శ్రీనివాస్ ఈ గ్రంథ రచనా సంకలనం చేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కె.వి రమణాచారి విలువైన సూచనతో ఈ మహోత్తమ కార్యాన్ని కృష్ణయ్య పవిత్ర హృదయంతో భుజాలకెత్తుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement