Tuesday, November 26, 2024

AP | కనకదుర్గమ్మకు కానుకల వర్షం..

ఎన్టీఆర్ బ్యూరో, ప్రభ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన రెండో దేవాలయమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మకు భక్తులు కానుకల వర్షాన్ని కురిపించారు. గడిచిన 20 రోజుల ఆలయ హుండీలను అధికారులు లెక్కించగా అందులో నగదు రూపంలో మూడు కోట్లు 700 గ్రాముల బంగారం ఆరు కేజీల వెండితో పాటు పెద్ద ఎత్తున విదేశీ డాలర్లు కానుకల రూపంలో వచ్చాయి.

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న మహా మండపం ఆరవ అంతస్తులు మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ఈవో కేఎస్ రామారావు ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లెక్కింపులో 20 రోజులకు నగదు రూ. 2,99,68,935/- వచ్చింది. కానుకల రూపములో బంగారం 648 గ్రాములు, వెండి 5 కేజీల 610 గ్రాములు, భక్తులు హుండీ ద్వారా అమ్మవారికి సమర్పించుకున్నారు.

విదేశీ కరెన్సీలో యూఎస్ఏ 542 డాలర్లు, ఓమన్ 1.5 రియాల్స్, ఇంగ్లాండ్ 20 పౌండ్లు, కెనెడా 100 డాలర్లు, ఆస్ట్రేలియా 20 డాలర్లు, యూరో 20 యూరోలు, సింగపూర్ 35 డాలర్లు, మలేషియా 1 రింగెట్, యూఏఈ 105 దిర్హమ్స్, కువైట్ 0.5 దినార్, హాంకాంగ్ డాలర్లు, సౌదీ 11 రియాల్స్, న్యూజిలాండ్ 20 డాలర్లు, సౌత్ ఆఫ్రికా -100 రండ్ లు, కత్తర్ 55 రియాల్స్ భక్తుల అమ్మవారికి కానుకల రూపంలో హుండీలో వేశారు.

- Advertisement -

ఆన్లైన్ హుండీ ద్వారా 67,230 రూపాయలు నగదును భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ హుండీ లెక్కింపులో పాలకమండలి సభ్యులు కట్టా సత్తయ్య , సహాయ కార్యనిర్వాహణాధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది, ఎస్పీఎఫ్, వన్-టౌన్ పోలీసు సిబ్బంది, భవాణీ సేవా దారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement