Thursday, November 28, 2024

Kanakadurga Temple – లక్షలలో భవానీలు రాకతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి

లక్షల సంఖ్యలో తరలివస్తున్న భవానీలు
కిక్కిరిసిన పోయిన‌ క్యూలైన్లు..
బస్టాండ్ వరకు నిలిచిపోయిన‌ భవానీలు
అమ్మ దర్శనానికి ఆరు గంటలకు పైగా సమయం
పోలీసు వలయాన్ని ఛేదించి ఘాట్ రోడ్డు గుండా తరలివస్తున్న భవానీలు
పోలీసులకు క్లిష్టంగా మారిన క్యూలైన్లు
కట్టడి చేయడం ఎలా అన్న‌దే స‌మ‌స్య‌

ఆంధ్రప్రభ స్మార్ట్​, ఎన్టీఆర్ బ్యూరో : అత్యంత భక్తి శ్రద్ధలతో, పరమ పవిత్రంగా అమ్మవారి దీక్షను ఆచరించి, కనకదుర్గమ్మ దర్శనం కోసం వందల కిలోమీటర్లు కాలినడకన వస్తున్న భవానీల రాకతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. దీక్షా విరమణ కోసం లక్షల సంఖ్యలో తరలివస్తున్న భవానీల రాకతో కొండపైకి ఉన్న క్యూ లైన్ లన్నీ కిక్కిరిసిపోయాయి. బస్టాండ్ వరకు కిలోమీటర్ల‌ మేరా వేల సంఖ్యలో భవానీలు వేచి ఉన్నారు. అమ్మ కరుణాకటాక్షం కోసం వచ్చిన భవానీలకు అమ్మవారి దర్శనానికి ఆరు గంటలకు పైగా సమయం పడుతోంది.

అంచ‌నాల‌కు మించి..

విజయదశమి శనివారం రోజున అమ్మ పాదాల చెంత దీక్ష విరమించేందుకు వచ్చిన భవానిలు క్యూలైన్లన్నీ నిండిపోవడంతో, ఘాట్ రోడ్డుపై నుండి ఆలయానికి చేరుకునేందుకు వేల సంఖ్యలో ఒక్కసారిగా పోలీస్ వాళ్ళయాలని ఛేదించుకుని రాజగోపురం మీదుగా దూసుకుని వచ్చారు. భవానీల రాకను అంచనా వేయని పోలీసులు, తేరుకునే లోపే భవానీలంతా పోలీసులను దోచుకుంటూ ఘాట్ రోడ్డు మీదుగా చేరుకున్నారు. అదనపు బలగాలను రప్పించి భవానీలను నియంత్రించిన సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది భవానీళ్లు అమ్మ ఆలయానికి చేరుకునేందుకు వాళ్ళు మార్గాల ద్వారా వెయ్య ప్రయాసలకు వచ్చి కొండగుట్టల గుండె ఆలయానికి చేరుకోవడం కనిపించింది. ఆదివారం ఒక్క రోజే కనకదుర్గమ్మవారిని లక్షన్నరకు పైగా భక్తులు దర్శించుకున్నారని అంచనా.

- Advertisement -

క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌..

దీక్షా విరమణ రెండో రోజు ఆదివారం కూడా భవానీలు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి చేరుకోవడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి, అన్ని విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసి, క్యూలైన్ల ద్వారా భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుండి అమ్మ దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున భవానీలు స్నాన ఘాట్ల వద్ద స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుని మెట్ల మార్గం ద్వారా కిందకు చేరుకుని మహా మండపం దిగువన ఏర్పాటు చేసిన దీక్ష విరమణ ప్రాంతంలో దీక్షను విరమిస్తున్నారు. అక్కడే భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించడంతోపాటు, లడ్డు ప్రసాద్ ని సైతం కొనుగోలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కేశఖండనశాల వద్ద తలనీలాలను సమర్పిస్తున్నారు.

అంతా గంద‌ర‌గోళం

శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా భక్తుల రాక అంచనాకు అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో ఉండగా, అంచనాలకు మించి భవానీలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భక్తుల రాకను నియంత్రించేందుకు వివిధ ప్రాంతాలలో హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేసినప్పటికీ, వాటికి మించి భక్తులు ఆదివారం తరలివచ్చారు. ఎప్పటికప్పుడు క్యూ లైన్ లో హోల్డింగ్ ఏరియాలను అంచనా వేస్తున్న అధికారులు దానికి అనుగుణంగా భక్తుల రాకను నియంత్రిస్తున్నప్పటికీ, ఆదివారం ఒక్కసారిగా వేల సంఖ్యలో వచ్చిన భవానీల రాక అందరికీ ఇబ్బందికర పరిస్థితులను తీసుకువచ్చింది.

కొండ‌లు, గుట్టలు దాటుకుని..


ఇటు కుమ్మరిపాలెం విద్యాధరపురం గొల్లపూడి తో పాటు వినాయకుడి గుడి, సీతమ్మ వారి పాదాలు, బ్యారేజీ వద్ద నుండి వేల సంఖ్యలో భవానీలు ఒక్కసారిగా దూసుకు వచ్చారు. ఎవరికి వారు అమ్మ దర్శనం తాపత్రయపడుతూ కొండలు గుట్టలు గోడలు దాటుతూ ఘాట్ రోడ్డుకి చేరుకున్నారు. వీరిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారిందనే చెప్పాలి. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల నుండే కనకదుర్గమ్మ దర్శనాన్ని అధికారులు ఏర్పాటు చేసి, రాత్రి 12 గంటల వరకు అమ్మవారి దర్శనాన్ని కల్పించినప్పటికీ, ఇంకా వేల సంఖ్యలో భక్తులు క్యూ లైన్ లో వేచి చూడాల్సి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement