విజయవాడ – దసరా శరన్నవరాత్రులు బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై 7వ రోజు వైభవంగా సాగుతున్నాయి.. ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు..
మూల నక్షత్రం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.. రాత్రి నుంచి భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రి కొండ కిందకు చేరుకుంటున్నారు భక్తులు.
వేలాదిగా భక్తులు క్యూలైన్లలో అర్ధరాత్రి 2 గంటల నుంచి వస్తున్నారు… హోల్డింగ్ ఏరియాలలో ఉండే భక్తులను విడతల వారీగా క్యూలైన్లలో వదులుతున్నారు పోలీసులు.. ఇవాళ రాత్రి 11 గంటల వరకూ దర్శనం కొనాగుతుంది.. భక్తుల రద్దీని బట్టి మరో అరగంట వరకూ దర్శన సమయం పెంచే అవకాశం ఉంది అంటున్నారు ఆలయ అధికారులు.
అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
కాగా, ఉదయం 9 గంటలకు కనకదుర్గమ్మ అమ్మవారిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు.. కుమార్తె ఆద్య తో కలిసి సరస్వతి దేవి నీ దర్శించు కొని , ప్రత్యేక పూజలు చేయించారు.
కనకదుర్గమ్మకు సారె సమర్పించనున్న చంద్రబాబు….
మరోవైపు.. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇక, మధ్యాహ్నం 2 గంటల నుంచీ 3 గంటల మధ్యలో కనకదుర్గమ్మకు సారె సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు.. సీఎంతో పాటు సీఎం సెక్యూరిటీ అనుమతిచ్చిన వారికి మాత్రమే ఆలయంలోనికి అనుమతి ఇవ్వనున్నారు..
మరోవైపు.. సీఎం రాక కారణంగా సామాన్య భక్తుల దర్శనాన్ని నిలుపుదల ఉండదని.. భక్తులకు యథావిథిగా దర్శనాలు కొనసాగుతూనే ఉంటాయని వెల్లడించారు దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. అయితే, సాయంత్రం 4 గంటల తర్వాతే వీఐపీ దర్శనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు..