Tuesday, November 19, 2024

అమరావతి శ్రీవారి ఆలయంలో వైభవంగా కళ్యాణోత్సవం

తిరుమల ప్రభన్యూస్‌ ప్రతినిధి: అమరావతిలోని వెంకట పాళెంలో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో సాయంత్రం వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కళ్యాణ వేధిక వద్దకు తీసుకువచ్చారు. అర్చకుల వేదమంత్రోఛ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనారాధన, పుణ్యహ వచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం మంగళసూత్ర ధారణ ఘట్టాలతో వేద మంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు.

చివరిగా నక్షత్ర హారతి, మంగళ హారతి కార్యక్రమంతో కళ్యాణం ధిగ్వియంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కళ్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంతో పులకించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటిఈవో గుణభూషణ్‌రెడ్డి, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణు భట్టాచార్యులు, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు, ఏవిఎస్‌వో సాయిగిరిధర్‌ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement