Tuesday, November 19, 2024

Kalyandurga – ఒక‌ర్ని ర‌క్షించ‌బోతే… ఇద్ద‌రు చ‌నిపోయారు..

ప్రమాద శాతం చెరువులో పడి విద్యార్థి మృతి
విద్యార్థిని రక్షించే ప్రయత్నంలో యువకుడు నవీన్ మృతి
ఇద్దరూ మృతితో మూగబోయిన కుందుర్పి గ్రామం
శోకసముద్రంలో ఇరు కుటుంబాలు
ఇద్దరి మృతి నా మనసును కలచివేసింది.
మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం – ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం (ప్రభన్యూస్) స్నేహితులతో కలిసి చదువుతూ. ఆట పాటలతో సరదాగా గడిపి పాఠశాల వదలగానే సాయంకాలానికి ఇంటికి స్నేహితులతో కలిసి వచ్చే విద్యార్థి విష్ణు తన స్నేహితుల కళ్ళ ఎదుటే చెరువు కుంటలో పడి మృతి చెందిన సంఘటన బుధవారం కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రం నందు చోటుచేసుకుంది.

- Advertisement -


వివరాల్లోకి వెళితే కుందుర్పి మండల కేంద్రం కి చెందిన సజ్జల అంగడి నాగేంద్ర. ఒక్కగానొక్క కుమారుడు విష్ణు.
మండల కేంద్రం లోని జెడ్ పి హెచ్. హై స్కూల్ నందు ఆరవ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే తన స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్లాడు. పాఠశాల విశ్రాంతి సమయం వేల స్నేహితులతో కలిసి పాఠశాల ప్రాంతంలో కొంత దూరం వద్ద ఉన్న చెరువు వద్దకు బహిర్ భూమికి పోయి పక్కనే ఉన్న చెరువులో శుద్ధి చేసుకోవడానికి వెళ్లి. వెనక్కి తిరిగిన సమయంలో ప్రమాదవ‌శాత్తు చెరువు ఊబిలో కూరుకుపోయాయి. తోటి విద్యార్థులు స్నేహితులు భయాందోళతో కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న యువకుడు కంసల నవీన్ (25) విద్యార్థి విష్ణు నీ కాపాడే ప్రయత్నంలో చెరువులో విష్ణుతో పాటు అత‌డు కూడా మునిగిపోయి మ‌ర‌ణించాడు..

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం – ఎమ్మెల్యే అమిలినేని

చెరువుకుంటలో కాలు ప‌డి ఇద్ద‌రు మ‌ర‌ణించ‌డం ప‌ట్ల కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిలినేని
సురేంద్రబాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. మృతి చెందిన ఇద్దరి కుటుంబాల స్థితిగతులు తెలుసుకొని వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement